43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు!

by Vinod kumar |
43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు!
X

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) వెల్లడించింది. ఏడు నగరాల్లో ధరలు తగ్గాయి. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి 50 నగరాలకు చెందిన తాజా ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, ఇప్పటికీ ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు కరోనా మహమ్మారికి ముందు కంటే తక్కువగానే ఉన్నాయి.

ఇది పరిశ్రమకు సానుకూలమని నివేదిక తెలిపింది. సమీక్షించిన కాలంలో ప్రధాన ఎనిమిది హౌసింగ్ మార్కెట్లకు సంబంధించి అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు అత్యధికంగా 9.1 శాతం పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరు 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం, హైదరాబాద్‌లో 6.9 శాతం, పూణెలో 6.1 శాతం, ముంబైలో 2.9 శాతం, చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed