- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Honda EV Scooter: హోండా నుంచి త్వరలో విద్యుత్ స్కూటర్ లాంచ్..!
దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లో(Indian Market) విద్యుత్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అధిక పెట్రోల్ ధరల నేపథ్యంలో చాలా మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్(EV) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూయిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఈవీలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric), ఏథర్(ATHER) వంటి కంపెనీలు ఈవీ సెక్టార్(EV sector)లో దూసుకెళ్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జపాన్(Japan)కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా(Honda) ఈవీ రంగంలోకి రావడానికి రెడీ అయ్యింది. త్వరలో భారతదేశం(India)లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతున్నట్లు పేర్కొంటూ ఓ టీజర్(Teaser)ను రిలీజ్ చేసింది. తన పాపులర్ వేరియంట్ హోండా యాక్టివా(Honda Activa) రూపంలో దీన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీని హోండా అధికారికంగా ప్రకటించకపోయినా నవంబర్ 27న తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం కూడా పంపారని తెలుస్తోంది. అలాగే జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుందనే వార్తలు కూడా వస్తున్నాయి.