- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానానికి పడిపోయిన అదానీ..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సృష్టించిన ప్రకంపనలతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో దిగజారారు. కంపెనీల షేర్లు భారీ నష్టాలను ఎదుర్కోవడంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కూడా తొలగిపోవచ్చు. తాజా బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద కేవల మూడు రోజుల్లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోవడంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయారు.
ప్రస్తుతం 84.4 బిలియన్ డాలర్ల(రూ. 6.90 లక్షల కోట్ల)తో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ 82.2 బిలియన్ డాలర్ల(రూ. 6.72 లక్షల కోట్ల) కంటే ఒక స్థానం పైన ఉన్నారు. మరోవైపు, రూ. 20 వేల కోట్ల నిధుల సేకరణ కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) బిడ్డింగ్ చివరి రోజు ఊపందుకుంది. నాన్-రిటైల్ విభాగం నుంచి స్పందన కారణంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. హిండెన్‌బర్గ్ వ్యవహారం కారణంగా కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎఫ్‌పీఓ పూర్తిస్థాయిలో స్పందన లభించడం విశేషం.