అలర్ట్: మార్చి 31తో వీటికి డెడ్‌లైన్!

by Harish |   ( Updated:2023-03-06 13:12:24.0  )
అలర్ట్: మార్చి 31తో వీటికి డెడ్‌లైన్!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి నెల వచ్చిందంటే చాలు మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతాము. దీంతో మనం చేసే ఖర్చులు, చెల్లింపులు మొదలగు వాటిలో భారీ మార్పులు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది మార్చి నెల 31 కొన్ని అంశాలకు చివరి తేదీ కానుంది. పాన్- ఆధార్ లింక్, ప్రభుత్వ పెట్టుబడి పథకం, ట్యాక్స్ నియమాలు మొదలగు వాటికి చివరి తేదీ కానుంది. కాబట్టి వీటి గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా అవసరం.

ఆధార్- పాన్ లింక్: ఆర్థిక లావాదేవీలు జరిపేవారు తప్పనిసరిగా తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. ఈ విషయంపై ప్రభుత్వం చాలా సార్లు వినియోగదారులను హెచ్చరించింది, కానీ కొంతమంది ఇప్పటికి కూడా ఆధార్- పాన్ లింక్ చేసుకోలేదు. అయితే ఈసారి మాత్రం మార్చి 31 వ తేదీని డెడ్‌లైన్‌గా పేర్కొంది. అది కూడా చివరి అవకాశంగా రూ. 1000 చెల్లించి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు.


ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం(PMVVY): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని వయసు పైబడిన(60 ఏళ్లు దాటిన) వారు ఉపయోగించుకోవచ్చు. ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీనిలో గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెన్షన్‌ను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్రాతిపదికన పొందవచ్చు. దీనిలో పెట్టిన అమౌంట్‌పై వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. అయితే ఈ పథకం చివరి గడువు సమీపించింది. ఈ మార్చి 31 తో ఈ పథకానికి అప్లై చేసుకోవడం చివరి తేదీ కానుంది. ఈ తేదీలోపు వినియోగదారులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.


ట్యాక్స్ నియమాలు: వివిధ ప్రభుత్వ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందడానికి మార్చి 31 లోపు ట్యాక్స్ మినహాయింపు ఫారమ్‌ను సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాలి. జీవిత బీమా పాలసీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు, PPF, NPS మొదలగు వాటిలో ఇన్వెస్ట్ చేసిన వారు ట్యాక్స్ మినహాయింపు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. అయితే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త బడ్జెట్‌లో ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు మార్చారు, కాబట్టి వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.



Advertisement

Next Story

Most Viewed