- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? IRCTC సికింద్రాబాద్-కేరళ టూర్ ప్యాకేజీని ఒకసారి చూడండి!
దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలంలో చల్లని ప్రదేశాలకు టూర్‌కు వెళ్లాలని భావిస్తున్నారా..? అయితే మీ కోసమే ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. చల్లని వాతావరణం, తోటలు, లోయలను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్న వారికి ‘కేరళ’ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. ఆరు రోజుల పాటు ఉండే ఈ టూర్‌లో వివిధ టూరిస్ట్ స్థలాలు, కొండలు, తోటలు, లోయలు, వాటర్ ఫాల్స్ మొదలగునవి చూడవచ్చు. ముఖ్యంగా మున్నార్ - అలెప్పి ఏరియాలను కవర్ చేయవచ్చు. మొత్తం టూర్ 5 రాత్రులతో 6 రోజుల పాటు సాగుతుంది.
ప్యాకేజీ పూర్తి వివరాలు
సికింద్రాబాద్ నుంచి ప్రతి మంగళవారం శబరి ఎక్స్‌ప్రెస్(రైలు నం.17230) ట్రైన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ యాత్ర మొదలవుతుంది. రాత్రంతా జర్నీ చేశాక, మరుసటి రోజు ట్రైన్ బుధవారం 12:55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మున్నార్‌కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ అండ్ ఎకో-పాయింట్ సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేశాక, శుక్రవారం అలెప్పీ కి వెళ్తారు. అక్కడ అన్ని ఏరియాలు చూశాక, రాత్రిపూట అలెప్పీలో బస చేస్తారు. తిరిగి శనివారం ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి పయనమవుతారు. ఆదివారం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు
ఈ టూర్‌లో రెండు ప్యాకేజ్‌లు ఉన్నాయి. 1 నుంచి 3 ప్రయాణికులు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే స్టాండర్డ్ సింగిల్ షేరింగ్‍కు రూ. 29,260. డబుల్ షేరింగ్‍కు రూ. 15,750. ట్రిపుల్ షేరింగ్‍కు రూ. 12,270 అవుతుంది. అదే కంఫర్ట్ సింగిల్ షేరింగ్‍కు రూ. 31,970. డబుల్ షేరింగ్‍కు రూ. 18,460. ట్రిపుల్ షేరింగ్‍కు రూ. 14,980 అవుతుంది.
ప్యాకేజ్‌లో అందించే ప్రయోజనాలు
స్టాండర్డ్ ప్యాకేజ్‌కు స్లీపర్ క్లాస్ ద్వారా రైలు ప్రయాణం, అదే కంఫర్ట్ వారికి 3AC. లోకల్ ప్రయాణాలకు AC వాహనం. 3 రాత్రుల వసతి, అల్పాహారం. ట్రావెల్ ఇన్సూరెన్స్.
ప్యాకేజ్‌లో లేనివి
లంచ్, డిన్నర్, రైలులో ఆహారం, సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్, బోటింగ్, హార్స్ రైడింగ్, టూర్ గైడ్ లాంటి ఈ ప్యాకేజీలో అందించబడవు. వీటిని ప్రయాణికులు విడిగా డబ్బులు చెల్లించి పొందవచ్చు.