HDFC Bank: రూ.16 వేల కోట్ల లాభాల్లో HDFC బ్యాంక్

by Harish |
HDFC Bank: రూ.16 వేల కోట్ల లాభాల్లో HDFC బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంక్ పన్ను తర్వాత లాభం 35.3 శాతం పెరిగి రూ.16,174.75 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.11,951.77 కోట్లుగా ఉంది. అదే జనవరి- మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ.16,510 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ప్రాతిపదికన చూసినట్లయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.16,474.85 కోట్లుగా ఉంది. ఆదాయం విషయానికి వస్తే, ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.57,816 కోట్ల నుంచి 44.77 శాతం పెరిగి రూ.83,701 కోట్లకు చేరుకుంది.

ఈ త్రైమాసికంలో బ్యాంక్ కేటాయింపులు రూ.2,860 కోట్ల నుంచి రూ.2,602 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం రూ. 29,837.1 కోట్లుగా ఉంది. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.23,600 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం 16 శాతం పెరిగి రూ.10,668 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చిలో 1.24 శాతంగా ఉండగా జూన్ చివరి నాటికి 1.33 శాతానికి చేరుకుంది. జూన్ త్రైమాసికం చివరి నాటికి బ్యాంక్ మొత్తం మూలధన సమృద్ధి 19.33 శాతంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed