HDFC Bank: తగ్గనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ.. ఎంసీఎల్ఆర్ తగ్గింపు

by S Gopi |
HDFC Bank: తగ్గనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ.. ఎంసీఎల్ఆర్ తగ్గింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ రేట్లు తగ్గనున్నాయి. తాజాగా బ్యాంకు ఎంపిక చేసిన పదవీకాలాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సవరించిన తర్వాత బ్యాంకు ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటుంది. ఈ కొత్త రేట్లు మంగళవారం(జనవరి 7) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీ రేట్లను తగ్గించడంలో వినియోగదారులు తీసుకునే రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆరు నెలలతో పాటు ఒక ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. అలాగే, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 9.50 శాతం నుంచి 9.45 శాతానికి బ్యాంకు సవరించింది. ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారంగా ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ రిటైల్ లోన్లు అయినా పర్సనల్ లోన్, వాహన, గృహ రుణాలపై ప్రభావం చూపుతుంది. ఎంసీఎల్ఆర్ రేట్ల తగ్గింపు ద్వారా ఈ రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి.

Advertisement

Next Story