క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం ప్రారంభించిన HDFC!

by Harish |   ( Updated:2023-02-17 02:12:01.0  )
క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం ప్రారంభించిన HDFC!
X

న్యూఢిల్లీ: దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు అరుదైన సేవలను అందించనుంది. బ్యాంకు తన వినియోగదారులకు రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) చెల్లింపు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా ఈ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బ్యాంకుగా నిలిచింది.

దీంతో ఇకనుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే కార్డులను యూపీఐ ఐడీకి లింక్ చేసుకోవచ్చు. దాంతో వినియోగదారులు అత్యధికంగా వినియోగిస్తున్న చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లో క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించడానికి వీలవుతుంది. క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తూ ఎక్కడైనా సరే చెల్లింపుల కోసం బ్యాంకు అకౌంట్ తరహాలో క్రెడిట్ కార్డును వినియోగించవచ్చు.

రూపే కార్డులను యూపీఐ చెల్లింపుల్లో వాడటం ద్వారా డిజిటల్ లావాదేవీలు మరింత సులభతర అవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావ్ అన్నారు. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపుల విధానంలో ఇదొక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ్ రాయ్ చెప్పారు. కాగా, ఈ సేవలను ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా త్వరలో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: పసిడి ప్రియులకు పండుగే.. నేడు భారీగా బంగారం ధర

Also Read...

అరుదైన రికార్డు సాధించిన మొదటి డిటర్జెంట్ బ్రాండ్‌గా సర్ఫ్ ఎక్స్ఎల్!

పోస్టాఫీసులో అకౌంట్‌ ఉందా.. అయితే ఖచ్చితంగా ఈ సర్వీస్ చార్జీల గురించి తెలుసుకోవాల్సిందే!

Advertisement

Next Story