- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Airtel: రూ. 194 కోట్ల జీఎస్టీ చెల్లించాలని ఎయిర్‌టెల్‌కు ఆదేశించిన జీఎస్టీ అప్పీలేట్ అథారిటీ
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు జీఎస్టీ అప్పిలేట్ అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం విభాగానికి లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలకు సంబంధించి రూ. 194 కోట్ల జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ కంపెనీ గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ జారీ చేసిన డిమాండ్ నోట్ ఆధారంగా లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలపై రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద రూ. 604.66 కోట్ల జీఎస్టీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులపై ఎయిర్‌టెల్ కంపెనీ అప్పీలుకు వెళ్లింది. 'కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) అప్పిలేట్ అథారిటీ ఆ డిమాండ్‌ను రూ. 194 కోట్లకు తగ్గిస్తూ అప్పీల్ ఆర్డర్‌ను ఆమోదించింది' అని కంపెనీ వివరించింది.