- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు వాటాలు కొన్న జీక్యూజీ కంపెనీ!
ముంబై: ఇప్పటివరకు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలను కొంటున్న అమెరికా కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్ మరో దేశీయ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ వి వైద్యనాథన్‌కు చెందిన 5 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్టు జీక్యూజీ పార్ట్‌నర్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువ రూ. 478.7 కోట్లు.
ఈ విక్రయం ద్వారా వచ్చిన నిధులను తిరిగి బ్యాంకు షేర్లను కొనేందుకు, పన్ను చెల్లింపులు, ఇతర సామాజిక అవసరాల కోసం వినియోగించనున్నట్టు తెలిపింది. కొత్త షేర్ల కోసం రూ. 229 కోట్లను, ఆదాయ పన్ను కోసం రూ. 240.5 కోట్లు, సామాజిక అవసరాలకు రూ. 9.2 కోట్లను కేటాయించనున్నట్టు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వివరించింది. బ్యాంకులో జీక్యూజీ పెట్టుబడి వార్తలతో సోమవారం ట్రేడింగ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర 1.21 శాతం పెరిగి రూ. 96.50 వద్ద ముగిసింది.