'ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మరింత మూలధనం అవసరం'!

by Vinod kumar |   ( Updated:2023-03-12 16:43:55.0  )
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మరింత మూలధనం అవసరం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరింత మూలధనాన్ని సమకూర్చాల్సి ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లకు ప్రభుత్వం గతేడాది రూ. 5,000 కోట్ల మూలధనాన్ని అందించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా నియంత్రణ అవసరాలను తీర్చేందుకు బీమా కంపెనీలకు ఎంత మూలధనం అవసరమో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.

ఆర్థిక సామర్థ్యంతో పాటు మార్జిన్ మెరుగుదల కోసం మూలధనం అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. గతనెలలో విడుదల 2023-24 బడ్జెట్‌లో బీమా కంపెనీలకు మూలధన నిధులు కేటాయించబడలేదు, అయితే సప్లిమెంటరీ డిమాండ్ ద్వారా నిధులు కోరవచ్చని అధికారి పేర్కొన్నారు. 2020-21లో ప్రభుత్వం మూడు బీమా సమ్ష్తలకు రూ. 9,950 కోట్ల నిధులను కేటాయించింది. అందులో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 3,605 కోట్లు, నేషనల్ ఇన్సూరెన్స్‌లో రూ. 3,175 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో రూ. 3,170 కోట్లు అందాయి. మూలధన కేటాయింపుతో పాటు ఇతర సంస్కరణలు సూచించబడ్డాయి. మరికొన్ని వివిధ దశాల్లో ఉన్నాయని అధికారి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 35 శాతం పడిపోయిన వాహనాల ఎగుమతులు!

Advertisement

Next Story

Most Viewed