ఉల్లి బఫర్‌ను 5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ప్రభుత్వం!

by Dishaweb |
ఉల్లి బఫర్‌ను 5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా దేశంలో చాలా పంటలు దెబ్బతిన్నాయి. దానివల్ల ఇంట్లో వాడే కూరగాయల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇటీవల కిలో రూ. 200 కంటే పైకి టమాటా ధరలు పెరిగాయి. తాజాగా అదే బాటలో ఉల్లి కూడా చేరనుంది. సాధారణంగా వర్షాకాలంలో ఉల్లి ధరలు ఖరీదవుతాయి. ఉల్లి ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ధరల నియంత్రణలో భాగంగా నిల్వను పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడంతో, ఈ ఏడాది ఉల్లి బఫర్ పరిమాణాన్ని ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. గతవారం ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అదనపు సేకరణ లక్ష్యాన్ని సాధించేందుకు దాదాపు లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని వినియోగదారు వ్యవహారాల జాతీయ సహకార సమాఖ్య(ఎన్‌సీఈఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఏఎఫ్ఈడీ)లను కూడా ఆదేశించింది. అలాగే, సోమవారం(ఆగష్టు 21) నుంచి ఎన్‌సీసీఎఫ్ ఔట్‌లెట్లు, మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఉల్లిని కిలో రూ. 25కి విక్రయించాలని సూచించింది. ఇతర ఏజెన్సీలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఉల్లి రిటైల్ ధరలు నియంత్రించబడతాయని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed