Gig Workers: గిగ్ వర్కర్ల కోసం కేంద్రం త్వరలో కొత్త పథకం

by S Gopi |
Gig Workers: గిగ్ వర్కర్ల కోసం కేంద్రం త్వరలో కొత్త పథకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ ఇవ్వనుంది. ఈ విభాగంలో పనిచేస్తున్న 77 లక్షల మందికి సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. డెలివరీ పార్ట్‌నర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు, ఇతర అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆరోగ్య బీమా లాంటి ప్రయోజనాలను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. దానికోసం వారి ఆదాయం నుంచి 1-2 శాతం వరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడం, ప్రధాని మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 17న దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. త్వరలో అగ్రిగేటర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చల తర్వాత పథకంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు సమాచారం. అయితే, అగ్రిగేటర్ల నుంచి వచ్చే విరాళం ద్వారానే ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్రం సమీక్షిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed