- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gold Bullion: బంగారు కడ్డీలకూ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం

దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారుల రక్షణకు, పసిడి సరఫరాలో నాణ్యత కోసం బంగారు కడ్డీలపై కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసే అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రత్నాభరణాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలకు ప్రత్యేక హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చారు. ఆభారణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసినప్పటి నుంచి నగల వ్యాపారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రత్నాభరణాల ముడిసరుకు నాణ్యతను నిర్ధారించేందుకు బంగారు కడ్డీలపై కూడా హాల్‌మార్క్ తప్పనిసరి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ఉద్దేశం, స్వర్ణకారులు బంగారాన్ని దిగుమతి చేసుకునే సమయంలో వారు కొనుగోలు చేసిన బంగారం నాణ్యతపై వారికే ఖచ్చితంగా తెలియదు. దాని ఖచ్చితత్వం తెలిసేందుకు మొత్తం సరఫరా వ్యవస్థ నిజాయితీని గుర్తించాలని నిధి ఖరే చెప్పారు. దీంతో పాటు ల్యాబ్‌లో తయారైన వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాటి అమ్మకాలకు నిబంధనలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆమె వెల్లడించారు.