Good News : పెట్రోల్ బంకుల డీలర్లకు గుడ్ న్యూస్

by M.Rajitha |
Good News : పెట్రోల్ బంకుల డీలర్లకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లోని ఆయిల్ కంపెనీలు(Oil companies) కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ బంకుల డీలర్లకు పండగపూట శుభవార్తను అందించాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకిచ్చే కమీషన్లు పెంచుతూ ప్రకటన జారీ చేశాయి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా హేతుబద్దీకరణ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఆయిల్ కంపెనీల ఈ నిర్ణయంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గనున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండే వినియోగదారులకు ఫ్యూయెల్ రేట్లు(Fuel Rates) తగ్గడం భారీ ఊరటనిచ్చే విషయమని కంపెనీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.

Advertisement

Next Story