- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Farmers Loan: అన్నదాతలకు తీపికబురు.. 35 పైసల్ వడ్డీకే ఎన్ని లక్షలు ఇస్తున్నారో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: Farmers Loan: బడ్జెట్ లో రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా కానుక అందించారు. బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చే రుణ లిమిట్ ను రూ. 3లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాద మంది రైతులు లబ్ది పొందే అవకాశం ఉంది. శుక్రవారం పార్లమెంట్ లో సమర్పించిన ఆర్థిక సర్వే 2024-25లో మార్చ 2024 వరకు దేశంలోని కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య 7.75 కోట్లుగా ఉంది. కేసీసీ కింద కింద రైతులకు రూ. 9.81 లక్షల కోట్ల రుణాలను అందించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 1998లో ప్రారంభించారు. ఈ స్కీమ్ నాబార్డ్ సిఫార్సుపై అమలు చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ పరికరాలను సకాలంలో కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులను సులభంగా తీర్చుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రైతులకు ప్రస్తుతం 3లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ లో రూ. 5లక్షలకు పెంచారు. కేసీసీ వడ్డీ రేటు ఏడాదికి 7శాతం పెంచారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వడ్డీపై రాయితీని కూడా అందిస్తుంది. రైతులు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే వారికి 3శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీని కారణంగా కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 4శాతం ఉంటుంది. అంటే మన రూపాయితో పోల్చితే దాదాపుగా 35పైసలు పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుకు కొన్ని అర్హత ప్రమాణాలు సెట్ చేసింది. భారతీయ పౌరుడిగా ఉండటంతోపాటు రైతు వయస్సు 18 నుంచి 75ఏళ్ల మధ్య ఉండాలి.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందే పక్రియ చాతలా సులభంగా ఉంటుంది. రైతులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండింటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు తమ సమీపంలోని బ్యాంక్ కు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్ తోపాటు, పాన్ కార్డు భూమి పత్రాలు, పాస్ పోర్ట్ సైజు ఫొటోవంటి అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి.
రైతులు పీఎం కిసాన్ యోజన వెబ్ సైట్ లేదా సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి ఆన్ లైన్ లో ఎలా ఫారమ్ నింపాలో తెలుసుకుందాం. SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/personal-banking/homeకి వెళ్లి అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్యాబ్ కు వెళ్లాలి. ఇక్కడ క్రాస్ లోన్ కి వెళ్లి, కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీ దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోని వివరాలు ఎంటర్ చేయండి. 3 నుంచి 4 రోజుల్లో బ్యాంక్ స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
రైతు కిసాన్ క్రెడిట్ కార్డుపై ఏడాదికి రెండు సార్లు వడ్డీ చెల్లించాలి. ఏడాదికోసారి లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా డిపాజిట్ చేయాలి. రైతులు అసలు డిపాజిట్ చేసిన మొత్తాన్ని మరుసటి రోజు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక రైతు ఏడాదికి రెండుసార్లు వడ్డీ చెల్లించిన..మొత్తంలోన్ ఒకసారి జమ చేసిన తర్వాత మాత్రమే వడ్డీ రాయితీని పొందేందుకు అర్హులవుతారు. అలాచేయని పక్షంలో 7శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో వడ్డీ చెల్లించకపోతే అకౌంట్ కూడా ఎన్ పీఎ గా మారవచ్చు.