సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు

by Hamsa |
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు. నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు జరుగుతాయని ఆశతో ఉంటారు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వంట నూనె ధరలు కొద్ది రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో మంగళవారం కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వంట నూనె ధరలను తగ్గిస్తూ ఊరటనిచ్చారు. గ్లోబల్ మార్కెట్‌లో రెట్ల తగ్గుదలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లో కూడా వంట నూనె ధరలను తగ్గించాలని అయిల్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుకింగ్ ఆయిల్ ధరలను ఏకంగా 6 శాతం తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కమొడిటీ రేట్లకు అనుగునంగా వంట నూనె ధరలు కూడా తగ్గించాలని తెలిపింది. ఫార్చూన్ బ్రాండ్ ఆయిల్, జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ వంటి కంపెనీలు వంట నూనె ధర లీటరుకు రూ. 5 నుంచి 10 చొప్పున తగ్గించనున్నట్టు సమాచారం. ఈ రేట్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య ప్రజలు సంతోషపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed