Gold rate : బడ్జెట్ ఎఫెక్ట్.. నేడు తులం బంగారం ఎంత అంటే?

by Jakkula Samataha |
Gold rate : బడ్జెట్ ఎఫెక్ట్.. నేడు తులం బంగారం ఎంత అంటే?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న (మంగళవారం) బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అమాంతం బంగారం ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు రూ.3000ల వరకు గోల్డ్ దిగొచ్చింది. కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఈ రోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,860గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర - రూ.64,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.70,860

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.64,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.70,860

Advertisement

Next Story

Most Viewed