Gold: దుబాయ్ నుంచే ఒకరు ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు?

by D.Reddy |   ( Updated:2025-03-08 16:12:28.0  )
Gold: దుబాయ్ నుంచే ఒకరు ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు?
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ (Dubai) నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ.. ఇటీవల కన్నడ నటి రన్యారావు (Ranyarao) బెంగుళూరు విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. రన్యారావు దాదాపు 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. సాధారణంగా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ (Gold Smuggling) చేస్తూ పట్టుబడ్డారనే వార్తులు తరచూ టీవీల్లో, పేపర్లలో చూస్తునే ఉంటాం. అయితే, ఈసారి ఓ సెలబ్రిటీ ఈ భారీ క్రైమ్‌లో భాగం అవ్వటంతో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు దుబాయ్ నుంచే బంగారాన్ని ఎందుకు ఎక్కువగా తరలిస్తారు. దుబాయ్ నుంచి లీగల్‌గా ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. పైగా దుబాయిలో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు. ఇక ప్రస్తుతం దుబాయ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారానికి 3,260 UAE దిర్హామ్‌గా ఉంది. అంటే.. భారతీయ కరెన్సీలో రూ.77,282. ఇక ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు.. ప్రభుత్వ ప్రకటించిన బంగారం రేటు ఆధారంగా కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాలి. ప్రస్తుతం బంగారం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది.

మీరు దుబాయ్ నుంచి బంగారం తీసుకువస్తే.. 10 గ్రాములకు దాదాపు రూ.4,842 ట్యాక్స్ చెల్లించాలి. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారంపై కస్టమ్స్ సుంకం చెల్లించినప్పటికీ.. పది గ్రాముల బంగారానికి రూ.82,119.34 అవుతుంది. అయినప్పటికీ మన దేశంలోని ధరలతో పోలిస్తే దాదాపు 6 నుంచి 7 వేల వరకు ధర తగ్గుతుంది. అందుకే చాలా మంది దుబాయ్‌కి వెళ్లినప్పుడు, దుబాయ్ నుంచి ఎవరైనా బంధువులు వస్తుంటే బంగారం కొని తీసుకురమ్మని చెబుతుంటారు.

ఇక, 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం.. భారతీయులు ట్యాక్స్‌లు చెల్లించి దుబాయ్ నుంచి ఎంత బంగారాన్ని అయినా తెచ్చుకునేందుకు అనుమతి ఉంటుంది. ట్యాక్స్ లేకుండా అయితే, ఒక్క భారతీయ పురుషుడు అయితే 20 గ్రాముల బంగారం, మహిళ అయితే 40 గ్రాముల వరకు బంగారాన్ని తెచ్చుకోవచ్చు. అది కూడా ఆభరణాల రూపంలో మాత్రమే అనుమతి ఉంటుంది. ఆభరణాలు కాకుండా మరే ఇతర రూపంలో బంగారాన్ని తెచ్చుకున్నా, పరిమితికి మించి తెచ్చుకున్నా కస్టమ్స్ వారికి పన్నులు చెల్లించాల్సి వస్తుంది.

Read More ....

Youtube: షాకింగ్ న్యూస్.. యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు

చంద్రుడిపై మరిన్ని చోట్ల మంచు నిక్షేపాలు.. కీలక డేటా సేకరించిన చంద్రయాన్-3

Next Story

Most Viewed