Gold: వచ్చే ఏడాది మరో 15-18 శాతం పెరగనున్న బంగారం

by S Gopi |
Gold: వచ్చే ఏడాది మరో 15-18 శాతం పెరగనున్న బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది భారీగా పెరిగిన బంగారం ధరలు ఇంకా పెరగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థికవ్యవస్థ సానుకూల వృద్ధి, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ దీపావళితో మొదలైన సంవత్ 2081లో పసిడి 15-18 శాతం పెరగనున్నదని వారు భావిస్తున్నారు. సంవత్ 2080లో బంగారం, వెండి అద్భుతమైన లాభాలను ఇచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల్లో నెలకొంటున్న మార్పుల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఈసారి స్థిరమైన లాభాలను చూస్తారు. కేంద్రం దిగుమతి సుంకం తగ్గింపును కొనసాగిస్తే బంగారం మరో 15-18 శాతం పెరగవచ్చు. సగటున 10 శాతం పెరగనుంది. ప్రభుత్వం దిగుమతి సుంకం మరింత పెంచితే బంగారం 15 శాతానికి పైగా ఖరీదు కానుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ ప్రతినిధి జతీన్ త్రివేది చెప్పారు. సంవత్ 2080లో బంగారం ఇతర సాధనాల కంటే బంగారం ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఇదే సమయంలో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, పసిడి 30 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయంగా నెలకొంటున్న దేశాల మధ్య వివాదాలు, ప్రధాన ఆర్థికవ్యవస్థలలో వడ్డీ రేట్ల తీరు, బంగారాన్ని ఎక్కువమంది సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకోవడం వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు వివరించారు. ఈ క్రమంలోనే గతవారం నాటికి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 82,400 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఇది రూ. 61,200 నుంచి 35 శాతం పెరిగింది.

Advertisement

Next Story