IT Department: నకిలీ రీఫండ్ మెసేజ్‌లను నమ్మొద్దు: ఆదాయపు పన్ను శాఖ

by S Gopi |
IT Department: నకిలీ రీఫండ్ మెసేజ్‌లను నమ్మొద్దు: ఆదాయపు పన్ను శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్నుకు సంబంధించి రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తిచేసిన చాలామంది పన్ను చెల్లింపుదారులు రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు అనేక మార్గాల్లో మోసగించిన సైబర్ నేరగాళ్లు తాజాగా ఐటీ రీఫండ్ల పేరున కూడా బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసి రీఫండ్ల కోసం చూస్తున్న వారికి నకిలీ మెసేజ్‌లు పంపి కొత్త పద్దతిలో మోసగిస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేసింది. రీఫండ్లకు సంబంధించి ఏమైనా మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'ఐటీ శాఖ పేరుతో వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌ను నమ్మి ఎలాంటి లింక్‌లనూ క్లిక్ చేయవద్దు. రీఫండ్‌కు చెందిన వివరాలు అధికారిక ఐటీఆర్ ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ద్వారా తెలియజేస్తాం. విడిగా మెసేజ్, కాల్స్ రూపంలో ఐటీ శాఖ సంప్రదించదని ' ప్రకటనలో పేర్కొంది. అలాగే, సైబర్ నేరగాళ్లకు పిన్ నంబర్, పాస్‌వర్డ్, క్రెడిట్ కార్డుల వివరాలను ఐటీ శాఖ కాల్స్ దారా అడగదని పేర్కొంది.

Advertisement

Next Story