హుజూర్‌నగర్ సభలో ఎస్ఎల్‌బీసీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
హుజూర్‌నగర్ సభలో ఎస్ఎల్‌బీసీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగాది పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) హుజూర్ నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని (Free rice scheme) ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించి.. అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెడుతున్నామని.. భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎవరు తొలగించలేరని స్పష్టం చేశారు. అలాగే నల్లగొండ జిల్లా దేశంలోని అత్యధికంగా సన్న వడ్లను పండిస్తుందని.. మరిన్ని నీళ్లు అందిస్తే.. ఇంకా మరిన్ని వడ్లను పండించి దేశానికి అన్న పెడతారని అన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) పై మాట్లాడిన సీఎం.. రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

44 కిలోమీటర్ల సొరంగంలో 34 కిలోమీటర్లు పూర్తయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల కాలంలో ఒక్క ఈ పనులు ముందుకు సాగలేదని అన్నారు. నల్లగొండ ప్రజలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి కోపం ఉందని ఈ కారణంగానే ఎస్ఎల్‌బీసీ సొరంగం (SLBC Tunnel) విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అతి త్వరలో సొరంగం పూర్తి చేసి.. నల్లగొండ జిల్లా ప్రజలకు నీరు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే అవినీతే లక్ష్యంగా చేసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కూళేశ్వరం అయిపోయిందని.. ఆ దెబ్బతో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడంటూ హుజూర్‌నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed