ఉగాది రోజు ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్: పీ4 విధానంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-03-30 14:20:19.0  )
ఉగాది రోజు ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్: పీ4 విధానంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగాది రోజు(Ugadi) ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమాన్ని(P4 program) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకే పీ4 కార్యక్రమం తీసుకొచ్చినట్లు తెలిపారు. పీ4 వంటి వినూత్నమైన కార్యక్రమంతో పేదల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి(Amaravti) రూపురేఖలు మారిపోతాయన్నారు. దేశంలోనే గొప్పగా అమరావతి అభివృద్ధి చెందబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్(Ntr) స్పూర్తితోనే కఠోరమైన క్రమశిక్షణ నేర్చుకున్నానని చెప్పారు. 2027 కల్లా పోలవరాన్ని(Polavaram) పూర్తి చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సరైన సమయంలో మోడీ(Modi) ప్రధాని అయ్యారని చెప్పారు. పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘‘నాకు పని చేయడమే తెలుసు. పేదరికం లేకుండా చేయగమే లక్ష్యం. మంచి రాజకీయాలను నమ్మా. ఏ తప్పు చేయలేదు. భవిష్యత్‌లోనూ చేయను. 47 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా. పాతికేళ్ల క్రితం తీసుకొచ్చిన ఐటీ వల్ల తెలుగు యువత అభివృద్ధి చెందింది. రైతు కూలీ పిల్లలు ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధితో తెలంగాణలో తలసరి ఆదాయం వస్తోంది. ఇప్పుడు సాయం పొందిన వాళ్లలో చాలా మంది కోటీశ్వరులు అవుతారు.’’ అని చంద్రబాబు తెలిపారు.

Next Story

Most Viewed