- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Luxery Cars: ఈఎంఐల నుంచి డిస్కౌంట్ల వరకు లగ్జరీ కార్ కంపెనీల పండుగ ఆఫర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లో అమ్మకాలను పెంచేందుకు లగ్జరీ కార్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈఎంఐలతో పాటు బైబ్యాక్ గ్యారెంటీ ఆఫర్లను కంపెనీలు తీసుకొచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య ఉండే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని లగ్జరీ కార్ల కంపెనీలు విక్రయాలు పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఆడి ఇండియా దేశంలో లక్ష మోడళ్ల అమ్మకాల మైలురాయిని చేరిన సందర్భంగా '100 డేస్ ఆఫ్ సెలబ్రేషన్ ' ప్రచారంలో భాగంగా ఆఫర్లను అందించనుంది. దీనికోసం ఆఫర్లు, రాయితీలు, సర్వీస్, యాక్సెసరీ సహా అనేక ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా తొలిసారి ఎక్స్‌క్లూజివ్ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా సైతం 'డ్రీమ్ డేస్ క్యాంపెయి ' పేరుతో తక్కువ ఈఎంఐ, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్, ట్రేడ్-ఇన్ ప్రయోజనాలను అందిస్తోంది. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా 'బీఎండబ్ల్యూ జోయ్ డేస్ ' పేరుతో 7.75 శాతం తక్కువ వడ్డీతో వాహనాలను అందిస్తోంది. తక్కువ ఈఎంఐతో పాటు ఇతర ప్రయోజనాలు అందించనున్నట్టు వెల్లడించింది.