- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
FPIs: పది రోజుల్లో రూ. 22,194 కోట్ల విదేశీ నిధులు వెనక్కి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెలలో కొంత సానుకూలంగా కనిపించిన ఎఫ్‌పీఐలు మరోమారు అంతర్జాతీయ, దేశీయ పరిణామాల కారణంగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ప్రధానంగా అమెరికా డాలర్ బలపడటం, డొనాల్డ్ ట్రప్ నేతృత్వంలో పన్నులపై తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ఆందోళనలు, దేశీయంగా డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలు ఎక్కువ ప్రభావితం చేశాయి. ఈ కారణంగా జనవరిలో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 22,194 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు డిసెంబరు నెలలో రూ. 15,446 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డిపాజిటరీల డేటా వెల్లడించింది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల మధ్య విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీలలో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకున్నారు. త్రైమాసిక ఫలితాలు, ట్రంప్ పన్ను నిర్ణయాలపై ఆందోళనలకు తోడు దేశ జీడీపీ వృద్ధి మందగించడం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. రూపాయి మారకం బలహీనంగా ఉండటం, డాలర్ విలువైన పెరగడంతో బాండ్ల రాబడితో మన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు అమ్మకాలకు సిద్ధపడుతున్నారు.