నాలుగు రోజుల్లో రూ. 10, 850 కోట్ల పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు!

by Javid Pasha |
నాలుగు రోజుల్లో రూ. 10, 850 కోట్ల పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ మదుపర్లు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున అమ్మకాలకు సిద్ధపడిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) గత కొన్ని రోజుల నుంచి నిధులను భారత మార్కెట్లకు మళ్లిస్తున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ నెల 2-5వ తేదీల మధ్య నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 10,850 కోట్ల విలువైన షేర్లను దేశీయ మార్కెట్లలో కొనుగోలు చేశారు. భారత ఆర్థికవ్యవస్థ పట్ల సానుకూలత, జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవడం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.

అంతకుముందు ఏప్రిల్ నెలలో విదేశీ పెట్టుబడిదారులు మొత్తం రూ. 11,630 కోట్లను, అంతకుముందు మార్చిలో రూ. 7,936 కోట్ల నిధులను మార్కెట్లలో పెట్టారు. గత నెల మొత్తం విదేశీ మదుపర్ల మద్దతుతోనే మన మార్కెట్లు మెరుగ్గా రాణించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మొత్తం నిధుల్లో ఫైనాన్షియల్, కేపిటల్ గూడ్స్ రంగాల్లో పెట్టగా, ఐటీ రంగం షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా విక్రయించారు.

Advertisement

Next Story

Most Viewed