- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ 26 తో ముగిసిన వారంలో 2.412 బిలియన్ డాలర్లు పడిపోయి 637.922 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం తెలిపింది. గత రిపోర్టింగ్ వారంలో కూడా నిల్వలు $2.28 బిలియన్లు క్షీణించి 640.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2021లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి $642.453 బిలియన్లుగా నమోదుకాగా, ఇటీవల ఏప్రిల్ 5న నిల్వలు $648.562 బిలియన్ల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఏప్రిల్ 26 నాటికి విదేశీ కరెన్సీ ఆస్తులు, రిజర్వులలో ప్రధాన భాగం $1.159 బిలియన్లు తగ్గి $559.701 బిలియన్లకు చేరాయని డేటా చూపించింది. అదే సమయంలో సమీక్ష వారంలో బంగారం నిల్వలు 1.275 బిలియన్ డాలర్లు తగ్గి 55.533 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు $15 మిలియన్లు పెరిగి $18.048 బిలియన్లకు చేరుకున్నాయని అపెక్స్ బ్యాంక్ పేర్కొంది. రిపోర్టింగ్ వారంలో IMFలో భారతదేశం రిజర్వ్ స్థానం కూడా $8 మిలియన్లు పెరిగి $4.639 బిలియన్లకు చేరుకుంది.