- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2 నెలల్లో పెరిగిన ఇంటి ఖర్చులు.. సబ్బులు, డిటర్జెంట్ ధరలు ప్రియం
దిశ, బిజినెస్ బ్యూరో: గత 2-3 నెలల్లో వివిధ రకాల నిత్యావసరాల ధరలు ఖరీదవడంతో ఇంటి షాపింగ్ బిల్లులు భారీగా పెరిగాయి. ఎఫ్ఎంసీజీ కపెనీలు కొన్ని రకాల ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ ఉత్పత్తులు, ఇతర విభాగాలపై 2 శాతం నుంచి 17 శాతం వరకు ధరలను పెంచాయి. విభాగాల వారీగా చూస్తే.. సబ్బులు, బాడీ వాష్ ఉత్పత్తులపై 2-9 శాతం, హెయిర్ ఆయిల్ ఉత్పత్తులపై 8-11 శాతం, కొన్ని రకాల ఆహార పదార్థాల ఉత్పత్తులపై 3-17 శాతం వరకు ధరలు పెంచినట్టు కంపెనీలు చెబుతున్నాయి. ప్రధానంగా ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల వ్యయం కారణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. 2022 నుంచి 2023 ప్రథమార్థంలో ధరలు క్రమంగా పెంచిన కంపెనీలు, ఆ తర్వాత పెంపునకు దూరంగా ఉన్నాయి. గత రెండు మూడు నెలల నుంచి మళ్లీ పెంపును కొనసాగిస్తున్నాయి. క్రూడ్, పామాయి ధరలు తగ్గినప్పటికీ పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లీ వంటి ఇతర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బికాజీ 2024-25లో తమ ఉత్పత్తుల ధరలు మరో 2-4 శాతం పెంచాలని భావిస్తోంది. టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించాలని చూస్తోంది. డాబర్ ఇండియా, ఇమామీ కూడా ఈ ఏడాది ధరలను పెంచనున్నట్టు సంకేతాలిచ్చాయి.
సబ్బులు, డిటర్జెంట్లు..
గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎంపిక చేసిన సబ్బుల ధరలు 4-5 శాతం పెంచింది. హిందూస్తాన్ యూనిలీవర్ తన డవ్ సబ్బుల ధరలను 2 శాతం పెంచగా, విప్రో సంతూర్ సబ్బు ధరను 3 శాతం పెంచింది. కోల్గేట్ విక్రయించే పామోలివ్ బాడీ వాష్ సింగిల్ డిజిట్‌లో, పియర్స్ బాడీ వాష్ 4 శాతం పెంచాయి. మరోవైపు హిందూస్తాన్ యూనిలీవర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్, జ్యోతీ ల్యాబ్స్‌కు చెందిన డిటర్జెంట్ బ్రాండ్లను 1-10 శాతం ధరలు పెంచాయి. హిందూస్తాన్ యూనిలీవర్ తన పోర్ట్‌ఫోలియోలోని షాంపూ ధరలను 4 శాతం వరకు పెంచింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నెస్లె కాఫీ ధరలు 8-13 శాతం, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం, ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్ ధరలు సింగిల్ డిజిట్ శాతం పెరిగాయి.