- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డన్జోను కొనుగోలు చేసే ఆలోచనలో ఫ్లిప్‌కార్ట్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై చర్చలు ప్రారంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని, డన్జో యాజమాన్యానికి సంబంధించి ఉన్న సంక్లిష్టతల కారణంగా కొనుగోలుకు ఇంకా సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చిన అంతరం ఇరు సంస్థల మధ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఒప్పందానికి డన్జోలో వాటా ఉన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ఆమోదించలేదని సమాచారం. 2022లో రిలయన్స్ రిటైల్ కంపెనీ డన్జోలో 26 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి డన్జోను ప్రశ్నించగా, వ్యాపారాన్ని కొనేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని మెయిల్‌కు బదులిచ్చింది. ఇటీవల డన్జో నిధుల కొరత కారణంగా పునర్నిర్మాణం, జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.