- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FICCI: ఈవీ బ్యాటరీలు, ఛార్జింగ్‌పై జీఎస్టీ తగ్గించాలని ఫిక్కీ డిమాండ్
దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) బ్యాటరీలు, ఛార్జింగ్ సేవలపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈవీలను సరసమైన ధరలకే అందించడం కోసం, మార్కెట్లో పోటీ పెరిగేందుకు, ఈవీ పరిశ్రమ అభివృద్ధి జీఎస్టీ తగ్గింపు తక్షణ అవసరమని ఫిక్కీ ఈవీ కమిటీ ఛైర్‌పర్సన్ సులజ ఫిరోడియా మోత్వాని మంగళవారం ప్రకటనలో తెలిపారు. గతంలో జీఎస్టీ కౌన్సిల్ లిథియం-అయాన్ బ్యాటరీలపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించింది. ఇంధన నిల్వ, ఈ-మొబిలిటీ విస్తరణను పెంచేందుకు మరింత రేట్ల కోత కావాలని, అలాగే, ఈవీ ఛార్జింగ్ సేవలపై జీఎస్టీ 18 శాతం ఉండగా, దీన్ని తగ్గించాలని ఫిక్కీ అభిప్రాయపడింది. ప్రధానంగా జీఎస్టీ రేట్లలో వ్యత్యాసాన్ని సులజ మోత్వాని ప్రస్తావించారు. ఈవీలకు 5 శాతం పన్ను అమలవుతుండగా, రీప్లేస్‌మెంట్ బ్యాటరీలకు 18 శాతం ఉంది. ఈవీలకు వర్తించే 5 శాతం రేటుతో పాటు బ్యాటరీలు, ఛార్జింగ్ సేవలపై కూడా అంతే జీఎస్టీ ఉండాలని ఆమె పేర్కొన్నారు.