- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
EV: 2026-27 నాటికి 13% పెరగనున్న ఈవీ టూవీలర్ వాటా
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరుగుతుంది. సాంప్రదాయ ఇంధన వాహనాల కొనుగోలు తగ్గిపోయి, ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీ టూవీలర్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, 2026-27 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా 13 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి వాటా 5 శాతంగా ఉండగా, సబ్సిడీలు, కొత్త లాంచ్‌ల కారణంగా ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతుతో వీటి స్వీకరణ మరింత పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది.
వీటి వాటా 2020-21లో కేవలం 0.4 శాతం నుండి 2023 ప్రారంభంలో 5.4 శాతానికి పెరిగింది, అయితే, తయారీదారులు తక్కువ ధరకు వాహనాలు లాంచ్ చేసినప్పటికి, ప్రోత్సాహకాల తగ్గింపు కారణంగా గత 24 నెలల్లో చాలా వరకు వాటా 4-7 శాతం మధ్యలో ఉందని జెఫరీస్ వెల్లడించింది. FY24లో 5 శాతం, FY25లో 7 శాతం, FY26లో 10 శాతం, FY27లో 13 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఇటీవలే పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మారిన ఓలా ఎలక్ట్రిక్, భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ప్రబలమైన తయారీదారుగా అవతరించింది, 2022-23లో దాని మార్కెట్ వాటా 21 శాతం నుండి 2023 నాటికి 35 శాతానికి పెరిగింది, 2024-25లో 49 శాతానికి చేరుతుందని నివేదికలో అంచనా వేశారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈవీల అమ్మకాలు రాబోయే రోజుల్లో వేగంగా పెరుగుతాయని జెఫరీస్ తెలిపింది.