- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీ ఇన్‌ఫ్లోలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరి నెలలో పెట్టుబడులు భారీగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) శుక్రవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. డేటా ప్రకారం, ఫిబ్రవరిలో మొత్తం రూ.26,866 కోట్ల ఇన్‌ఫ్లోలు వచ్చాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPలు) ద్వారా పెట్టుబడులు జనవరిలో రూ.18,838 కోట్ల నుండి, ఫిబ్రవరిలో రూ.19,186 కోట్లకు కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్‌లు ఫిబ్రవరిలో బలమైన ఇన్‌ఫ్లోలను చూశాయి. డేటా ప్రకారం, స్మాల్-క్యాప్ ఫండ్‌లు రూ.2,922.4 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత రూ.1,808.2 కోట్లతో మిడ్-క్యాప్ ఫండ్‌లు, రూ. 921.14 కోట్లతో లార్జ్-క్యాప్ ఫండ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరిలో, మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు జనవరిలో రూ.52.74 లక్షల కోట్ల నుంచి 3.42 శాతం వృద్ధితో రూ.54.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో మొత్తం రూ. 63,808.82 కోట్లు వచ్చాయి. ఇది జనవరిలో రూ.76,468.96 కోట్లుగా ఉంది.