- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
EPFO: పీఎఫ్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఫ్రీగా రూ. 7లక్షల బీమా

దిశ, వెబ్‌డెస్క్: EPFO: ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) శుభవార్త చెప్పింది. సంస్థ 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము(EDLI )లో కీలక మార్పులను తీసుకువచ్చింది. కుటుంబాలు డెత్ క్లెయిమ్స్ ఫైల్ చేయడానికి సులభతరం చేయడం, ఇన్సూరెన్స్ చెల్లింపులను పెంచడం, ప్రతి ఏడాది మరిన్ని కటుంబాలకు సహాయం చేయడానికి కవరేజీని విస్తరించడం లక్ష్యంగా సవరణలు చేసింది.
ప్రావిడెంట్ ఫండ్ రిటైర్ మెంట్ సేవింగ్స్ టూల్, ఎమర్జెన్సీ ఫండ్(Emergency fund) గా ఇది పని చేస్తుంది. జీతం పొందే ఉద్యోగులు కష్ట సమయాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు రిటైర్మెంట్ తర్వాత మంచి భవిష్యత్తుకు హామీ ఇస్తుంది. సంస్థ ప్రకటించిన తాజాగా అప్ డేట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఎంప్లాయిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్(EDLI) కింద రూ. 7లక్సల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద ఈడీఎల్ఐ(EDLI) స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ. 75 ఛార్జీ ఉంటుంది. ఇవి కూడా ఉద్యోగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తుంటాయి.
ఒక ఉద్యోగి తన సర్వీసులో ఉండగానే మరణించినట్లయితే అతని చట్టబద్దమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందేందుకు అర్హులవుతారు. ప్రస్తుతం ఈ స్కీము కింద కనీసం రూ. 2.5లక్షలు గరిష్టంగా రూ. 7లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12నెలల్లో ఉద్యోగి సగటు నెలలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తుంటారు. ఈపీఎఫ్(EPFO) సభ్యులందరూ ఆటోమెటిగ్గా ఈడీఎల్ఐ స్కీముకు అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఎలాంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలలవారీ వేతనంలో 0.5శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా ఈ బీమా కవరేజీ(Insurance coverage) స్వతంత్రంగా ఉంటుంది.
కాగా గతంలో ఈడీఎల్ఐ(EDLI) స్కీమ్ కింద గరిష్టంగా రూ. 6లక్షల బీమా చెల్లింపు ఉంటుండేది. అయితే 2024 ఏప్రిల్ లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీస చెల్లింపును రూ. 2.5లక్షలకు గరిష్టంగా రూ. 7లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే దీని లక్ష్యం. ఈడీఎల్ స్కీమ్(EDLI) కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్ తో పాటు ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధించిత ఈపఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
Post Office Scheme: 5 లక్షలకు 15 లక్షలు.. అసలు రిస్క్ లేని పోస్టాఫీసు పథకం