- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేటీఎం సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించిన ఈడీ
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ప్రకారం కంపెనీలో ఆర్‌బీఐ ఆరోపించిన అవకతవకలపై అధికారిక దర్యాప్తునకు ముందు కేంద్ర ఏజెన్సీ ఆయా పత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తుంది. డాక్యుమెంట్లను సమీక్షించిన అనంతరం విచారణపై ముందుకెళ్లాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫెమా చట్టంలోని ఉల్లంఘనలు జరిగాయా లేదా అనే దానిపై సమీక్షిస్తారు. ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించిన సమయంలో డాక్యుమెంట్ల స్వాధీనంతో పాటు మరికొంత సమాచారాన్ని కోరినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి, ఎలాంటి అక్రమాలు గుర్తించలేదు. ఫెమా చట్టం ప్రకారం ఏదైనా ఉల్లంఘన కనుగొన్న తర్వాతే ఫెమా కింద కేసు నమోదు చేయబడుతుందని వారు వెల్లడించారు.