- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత పర్యటన రద్దు తర్వాత చైనాకు వెళ్లిన ఎలన్ మస్క్
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ బ్రాండ్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవల తన భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన అంశాల కారణంగానే ఆయన భారత పర్యటనను వాయిదా వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత పర్యటన సందర్భంగా దేశీయ మార్కెట్లో టెస్లా ప్రవేశానికి సంబంధించి ప్రణాళికలను ప్రకటించడం, ప్రధాని నరేంద్ర మోడీపై సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ట్రిప్ రద్దు ప్రకటన వచ్చిన రోజుల వ్యవధిలోనే టెస్లా సీఈఓ అనూహ్యంగా చైనా పర్యటనకు వెళ్లినట్టు సమాచారం. టెస్లా కంపెనీకి చైనా రెండో అతిపెద్ద మార్కెట్. ఈ ఏడాది చివరికి భారత పర్యటన ఉంటుందని, అదే సమయంలో చిన్న, సరసమైన మోడళ్ల ఉత్పత్తి లక్ష్యంతో కంపెనీ ప్లాంటు కోసం భారీ పెట్టుబడుల ప్రకటనలు ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ ప్రకారం, చైనాలో ఫుల్-సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడంపై చర్చినేందుకు, దానికి సంబంధించిన టెక్నాలజీల కోసం శిక్షణ ఇచ్చేందుకు అవసరమన డేటా బదిలీ ఆమోదానికి బీజింగ్‌లో సీనియర్ అధికారులను కలిసినట్టు తెలుస్తోంది. అయితే, ఎలన్ మస్క్ చైనా పర్యటన గురించి బహిర్గతం చేయలేదు.