గుడ్‌న్యూస్.. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్

by Harish |   ( Updated:2023-02-08 15:36:12.0  )
గుడ్‌న్యూస్.. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్‌ల వాడకం క్రమంగా పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా చాలా మంది ప్రజలు ఈవీల వాడకంపై మక్కువ చూపిస్తున్నారు. అయితే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా శుభవార్త అందించింది. అదేలాగంటే, పాత పెట్రోల్ స్కూటర్‌ను మార్చుకుని ఎంచక్కా కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులకు తక్కువ ధరలో ఈవీ స్కూటర్లను అందించడంలో భాగంగా కంపెనీ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది.


ఎక్స్చేంజ్ ఆఫర్ కోసం వినియోగదారులు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లి, పాత వెహికల్‌ను వారికి ఇవ్వాలి. కంపెనీ అధికారులు మీ వెహికల్ కండీషన్ ఆధారంగా ఒక ధరను నిర్ణయిస్తారు. ఆ ధర పోను మిగిలిన అమౌంట్‌ను చెల్లిస్తే కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చు.


అలాగే, వినియోగదారుల సౌకర్యం కోసం లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఓలా ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో, ఎస్1 అనే మూడు వేరియంట్లను అందిస్తుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 84,999 నుంచి ఉన్నాయి.



Advertisement

Next Story