- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IRCTC పేరుతో నకిలీ యాప్!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ ప్రయాణీకులను అప్రమత్తం చేసింది. ఐఆర్‌సీటీసీ పేరుతో నకిలీ యాప్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఉందని, దాన్ని ఎవరూ డౌన్‌లోడ్ చేయవదాని స్పష్టం చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల ద్వారా మోసపూరిత యాప్‌లు చెలామణి అవుతున్నాయని, అటువంటి Apkఫైల్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు మోసపూరితంగా వినియోగదారులకు చెందిన యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్-డెబిట్ కార్డుల వివరాలను దొంగలించి మోసం చేయవచ్చని వెల్లడించింది. వ్యక్తిగత సమాచారం ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చని వివరించింది. ఎవరైన నకిలీ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఇబ్బందులు పడతారని పేర్కొంది.
ప్రయాణీకులు టికెట్లను బుక్ చేసుకునేందుకు సంస్థ అధికారిక రైల్ కనెక్ట్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. సైబర్ దొంగలు సంస్థ పేరుతో పంపించే లింక్‌లను ఓపెన్ చేయవద్దని పేర్కొంది.