- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 659 కోట్ల లాభాలను ప్రకటించిన DMart
ముంబై: డిమార్ట్ పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 658.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2 శాతం ఎక్కువ. గత ఏడాది లాభం రూ.642.89 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం 43 శాతం పెరిగింది. అలాగే, కార్యకలాపాల ద్వారా వార్షిక ఆదాయంలో 18.2 శాతం పెరిగి రూ.11,865.44 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరం క్రితం రూ. 10,038.07 కోట్లుగా ఉంది.
సమీక్షిస్తున్న త్రైమాసికంలో వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (EBITDA) ఆదాయాలు రూ.1,008 కోట్ల నుంచి రూ.1,035 కోట్లుకు పెరిగాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్ త్రైమాసికంలో మూడు కొత్త స్టోర్‌లను ప్రారంభించింది. ప్రస్తుతం జూన్ 30 నాటికి 327 స్టోర్‌లను నిర్వహిస్తోంది. దుస్తులు, సాధారణ వస్తువుల విక్రయాలు తక్కువగా ఉండటం వలన మొత్తం స్థూల మార్జిన్లు మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నోరోన్హా అన్నారు.