- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షావోమీ మొబైల్‌ఫోన్‌లను తయారు చేయనున్న డిక్సన్ టెక్నాలజీస్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ చైనా మొబైల్‌ఫోన్ బ్రాండ్ షావోమీతో భాగస్వామ్యం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. షావోమీ ఫోన్‌ల తయారీతో పాటు ఎగుమతుల కోసం ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయని, అవి ముగిసిన అనంతరం భాగస్వామ్యం గురించి అధికారికంగా వెల్లడించనున్నట్టు డిక్సన్ టెక్నాలజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత ఎలక్ట్రానిక్ తయారీ రంగం పుంజుకుంటున్న ధోరణి సానుకూలంగా ఉంది. దేశీయంగానే కాకుండా గ్లోబల్ బ్రాండ్లు కూడా మొబైల్‌ఫోన్ తయారీ, సరఫరా కోసం గణనీయంగా పెట్టుబడులను పెడుతున్నాయి.
రానున్న కొన్నేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) వైస్-ఛైర్మన్, మెడీ అతుల్ బి లాల్ అన్నారు. షావోమీ ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయవంతమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. నాణ్యత, ట్రాక్ రికార్డ్ ద్వారా దేశంలోని వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా కేంద్ర మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరించిన తర్వాత డిక్సన్ ఈ ఏడాది ఆగష్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది.