- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రెడిట్ సూయిస్ బకాయిలను చెల్లించిన స్పైస్‌జెట్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ విమాన సంస్థ స్పైస్‌జెట్ తన బకాయిలను క్లియర్ చేసిందని క్రెడిట్ సూయిస్ బ్యాంక్ శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. బ్యాంక్ రిక్వెస్ట్ మేరకు ఈ కేసు విచారణను జులై నెలాఖరుకు వాయిదా వేసింది. ఈ వివాదం నవంబర్ 2011 నాటి నుంచి సాగుతుంది. అప్పటి కళానిధి మారన్ యాజమాన్యంలోని స్పైస్‌జెట్, SR టెక్నిక్స్‌తో 10 సంవత్సరాల ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులను స్వీకరించడానికి అన్ని హక్కులను క్రెడిట్ సూయిస్‌కు అప్పగించగా, స్పైస్‌జెట్ దాదాపు రూ.200 కోట్ల($24 మిలియన్ల)కు పైగా చెల్లింపులు చేయకపోవడంతో సూయిస్ బ్యాంక్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో భాగంగా గత విచారణలో చెల్లింపులను ఆలస్యం చేయవద్దని కోర్ట్ స్పైస్‌జెట్‌ను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను సంస్థ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదని ఆరోపిస్తూ ధిక్కార చర్యలను తీసుకోవాలని క్రెడిట్ సూయిస్ మార్చి 2023లో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 15 నాటికి చెల్లించాల్సిన $15 మిలియన్లలో $13.75 మిలియన్లు మాత్రమే అందుకున్నట్లు క్రెడిట్ సూయిస్ కొద్దికాలం క్రితం కోర్టుకు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని కోర్టు ఎయిర్‌లైన్‌ని ఆదేశించగా, తాజాగా స్పైస్‌జెట్ బకాయిలను క్లియర్ చేసిందని క్రెడిట్ సూయిస్ సుప్రీంకోర్టుకు తెలపడం గమనార్హం.