Cement Prices : సిమెంట్ ధరలు పెంచిన సంస్థలు.. తెలంగాణ, ఏపీ, తమిళనాడు పై ప్రభావం

by Ramesh N |
Cement Prices : సిమెంట్ ధరలు పెంచిన సంస్థలు.. తెలంగాణ, ఏపీ, తమిళనాడు పై ప్రభావం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, రామ్‌కో, ఏసీసీ, ఇండియా సిమెంట్స్, అంబుజా సిమెంట్, చెట్టినాడ్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్ వంటి ప్రధాన సిమెంట్ కంపెనీలు ధరలు పెంచినట్లు ‘ఎన్డీటీవీ ప్రాఫిట్’ పేర్కొంది. ముఖ్యంగా దీని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై పడుతున్నట్లు తెలిపింది. ఈ సవరించిన ధరలు గురువారం నుంచే అమలులోకి రానున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి 30 మేర ధర పెంచినట్లు సమాచారం. తమిళనాడులో రూ.10 నుంచి 20 కి పెంచినట్లు తెలిసింది. ముడి సరుకు, రవాణా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో నిర్మాణ రంగంలో ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ధరల పెంపు వార్తలతో సిమెంట్ కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి.

Next Story

Most Viewed