- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ కోసం అవసరమైన బొగ్గు సిద్ధంగా ఉంది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు డిమాండ్‌కు సరిపడా బొగ్గును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి 874 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్‌ను అందించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. పీఏం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఇన్ కోల్ సెక్టార్ బుక్‌లెట్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన ఆయన మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి, విద్యుత్ మంత్రిత్వ శాఖ 821 మిలియన్ టన్నుల బొగ్గను కోరగా ఆ మొత్తాన్ని సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు.
2025 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ 874 మిలియన్ టన్నుల బొగ్గును కోరింది. దీనిని కూడా అందిస్తామని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్లెండింగ్ ప్రయోజనాల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గు వాటా తగ్గిందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 30.80 మిలియన్ టన్నులు కాగా, 2024లో అది 22.20 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఒక ఏడాదిలో బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా రూ.82,264 కోట్లను ఆదా చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం 2026 నాటికి బొగ్గు దిగుమతులను సున్నాగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.