మాంసం ప్రియులకు భారీ షాక్.. అమాంతం పెరిగిన చికెన్ ధరలు

by sudharani |   ( Updated:2023-06-08 11:02:08.0  )
మాంసం ప్రియులకు భారీ షాక్.. అమాంతం పెరిగిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతీ రోజూ కాకపోయిన కనీసం రెండు, మూడు రోజులకు ఒకసారైన చికెన్ తెచ్చుకుని ఆరగిస్తారు. లేదంటే బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుని తింటారు. అయితే.. చికెన్ ప్రియులకు షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు రూ.240 ఉండే చికెన్ ధర ఇప్పుడు రూ.300లకు చేరుకుంది. దీంతో మాంసం ప్రియులు చికెన్ కొనాలంటేనే భయందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

కాగా, ఈ వేసవిలో అధిక ఉష్టోగ్రత నమోదు అవుతుండటంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కోళ్ల సంఖ్య తగ్గి చికెన్ ధరలపై ప్రభావం పడుతుంది. గత నెల కేజీ రూ.154 ఉన్న ధర నెల మధ్యలో రూ.200లకు మంత్ ఎండింగ్ వరకు రూ.250 దాటింది. తాజాగా రూ.300 మార్క్‌ను దాటింది. ఇదే ధరలు ఈ నెల మొత్తం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలు మాంసం ప్రియులుకు షాకిచ్చాయనే చెప్పవచ్చు.

Also Read..

గొంతులో చేప ముళ్లు ఇరుక్కుందా.. అయితే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే..!

Advertisement

Next Story