మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఈజీగా 6వేలు పొందండి ఇలా!

by samatah |   ( Updated:2023-03-13 13:34:11.0  )
మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఈజీగా 6వేలు పొందండి ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ఆఫర్స్ తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం సరికొత్త కాంటెస్ట్‌ని నిర్వహిస్తుంది. ఇందులో గనుక గెలిస్తే ఏకంగా ఆరువేల రూపాయలు పొందవచ్చు. ఆ కాంటెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోదీ సర్కార్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసులను మెరుగుపరచాలని చూస్తోంది. ఇందులో భాగంగా మహిళల భద్రతే లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. దీని కోసం కేంద్ర హోమ్ శాఖ ఓ పాన్ ఇండియా సింగిల్ నెంబర్‌ను తీసుకు వచ్చింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 112కు కాల్ చెయ్యవచ్చు. పోలీసులకు, ఫైర్, అంబులెన్స్ ఇలా పలు రకాల ఎమర్జెన్సీ సర్వీసులు ని ఈ నెంబర్ తో పొందొచ్చు. తాజాగా మైగౌవ్‌తో కలిసి ఒక కాంటెస్ట్ ని హోం శాఖ నిర్వహిస్తోంది. రీల్స్ లేదా షార్ట్ వీడియో, లోగో డిజైన్, జంగీల్ కంపోజ్ వంటి వాటికి కోసం అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. ఈ అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఏప్రిల్ 8వ తేదీగా ఉంది.

దీనిలో విజేతగా నిలిస్తే రూ. 6 వేల వరకు డబ్బులు సొంతం చేసుకోవచ్చు. లోగో డిజైన్, జంగిల్ కంపోజ్, రీల్ ఇలా కేటగిరి ప్రకారం క్యాష్ ప్రైజ్ మారిపోతుంది. విజేతగా నిలుస్తే రూ.3 వేలు, రెండో విన్నర్‌కు రూ.2 వేలు, మూడో విన్నర్‌కు రూ.100 లభిస్తాయి.

Read more:

Fate: మనిషికి మంచి చెడులన్నీ ఎలా జరుగుతాయో తెలుసా?

Advertisement

Next Story