- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని కేంద్రం నిరవధికంగా పొడిగించింది. గతంలో దేశవ్యాప్తంగా ఉల్లి లభ్యతను పెంచడానికి, ధరల కట్టడికి ఎగుమతులపై ఈ మార్చి 31 వరకు నిషేధాన్ని విధించారు. ఈ చివరి గడువు మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి తాజాగా మార్చి 31 తర్వాత కూడా ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించి వాటిని అమలుపరిచే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది.
ఉల్లి పంట దిగుబడి తక్కువగా ఉండటం వలన కొరత ఏర్పడి దాని ధర అమాంతం పెరగడంతో డిసెంబర్ నెలలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. ప్రస్తుతం దేశంలో ధరలు అందుబాటులో ఉన్నాయి. అధికంగా ఉన్నప్పటితో పోలిస్తే ధరలు సగానికిపైగా తగ్గాయి. దీంతో చాలా మంది వ్యాపారస్తులు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని అంచనా వేయగా, తాజాగా ప్రభుత్వం నిరవధికంగా నిషేధాన్ని పొడిగించింది. మార్చి 23, శనివారం నాడు హోల్‌సేల్ ఉల్లి ధరలు కిలోగ్రాముకు సగటున రూ.18కి చేరుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ధరలు కిలో రూ.7 నుండి రూ.30 మధ్య ఉన్నాయి.