- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ రూపీ లావాదేవీలకు క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు!
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రూపీ లావాదేవీలను ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడానికి కీలక చర్యలు తీసుకుంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగానికి అందించే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు తరహా పలు ప్రోత్సాహకాలను ఈ డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు ఇస్తున్నాయి. దీని ద్వారా ఈ రూపీ లావాదేవీలు క్రమంగా పుంజుకుంటాయని అధికారుల అంచనా.
ఇప్పటికే అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ, డిజిటల్ కరెన్సీ లావాదేవీలను పెంచడానికి చర్యలు మొదలు పెట్టింది. దీంతో పాటు యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు హైవే టోల్ గేట్ దగ్గర ఫాస్ట్‌ట్యాగ్, ట్రావెల్ బుకింగ్‌లు, మొబైల్ రీచార్జ్‌లు మొదలగు వాటికి క్యాష్‌బ్యాక్‌లు, పలు ఆఫర్లను అందిస్తున్నాయి. సెప్టెంబరులో, డిజిటల్ రూపాయి వినియోగదారులను ఆకర్షించడానికి ఈ-రూపాయిని రియల్ టైమ్ పేమెంట్ గేట్‌వే UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)కి లింక్ చేయడం వంటి కొత్త ఫీచర్‌లను కూడా ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది.
- Tags
- digital currency