ఈ యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లు కడితే తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు

by Harish |   ( Updated:2023-03-14 12:48:10.0  )
ఈ యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డు బిల్లు కడితే తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు సమయంలో కొత్తగా వచ్చిన ఒక యాప్ ద్వారా పేమెంట్ చేస్తే రివార్డు పాయింట్లు, వోచర్లు పొందవచ్చు. అలాగే, వీటిని క్యాష్‌గా కూడా మార్చుకోవచ్చు. బెంగళూరు ఆధారిత కంపెనీ చెక్యూ, ఇటీవల యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వారు తమ కార్డు బిల్లుల చెల్లింపును ఈ యాప్ ద్వారా చేస్తే పేమెంట్ మొత్తంలో 1.5 శాతాన్ని చెక్యూ చిప్స్ రూపంలో తిరిగి పొందొచ్చు. ఈ సదుపాయం మార్చి 13 నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ ఇది ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే.

బిల్లుల చెల్లింపు సమయంలో వోచర్లు లేదా క్యాష్‌బ్యాక్ చిప్స్ రూపంలో ఉంటాయి. చెక్యూ యాప్‌లో చిప్స్ అనేవి కరెన్సీగా పరిగణిస్తారు. ఈ యాప్ ద్వారా చేసే ప్రతి పేమెంట్‌పై చెక్యూ చిప్స్ వస్తాయి. తరవాత వీటిని క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలా చేయడం ద్వారా అమౌంట్ నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. కనీసం రూ.100 బిల్లు పేమెంట్ కూడా చేయవచ్చు.

Advertisement

Next Story