- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఆర్థిక సంవత్సరంలో కార్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: కొవిడ్ మహమ్మారి సమయంలో ఉత్పత్తి తగ్గిపోవడం, డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా కార్ల కొనుగోలుదారులు డెలివరీల్లో జాప్యాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అనేక ఇబ్బందులను చూసిన వినియోగదారులు త్వరలో వాహన రంగం నుంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాహన తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లను ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొంతకాలంగా వరుస నెలల్లో కంపెనీలు ధరలు పెంచుతూ వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం కార్ల పరిశ్రమలో డిమాండ్ తగ్గనుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి మెరుగైన గిరాకీ, వృద్ధి చూసిన తర్వాత డిమాండ్ తగ్గుముఖం పట్టడం, డీలర్‌షిప్‌ల వద్ద ఇన్వెంటరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో కంపెనీలు సమస్యను అధిగమించేందుకు తగ్గింపులు, రాయితీలు ఇవ్వనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 42.9 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదవుతాయని అంచనా. పరిశ్రమ బలంగా ఉందని, ఇదే వృద్ధిని కొనసాగించడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కొంతకాలంగా కొత్త కార్ల ధరలు పెరగడం, కరోనా వల్ల ఏర్పడిన ఉత్పత్తి లోటు పూర్తవడం పరిశ్రమకు సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ విభాగంలో కొత్త వాటి కంటే యూజ్‌డ్ కార్లకు డిమాండ్ పెరగడంతో కంపెనీలు పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయని జాటో డైనమిక్స్ డైరెక్టర్ రవి భాటియా అన్నారు. కరోనా వల్ల ఉత్పత్తి క్షీణత, చిప్‌ల కొరత వల్ల పెండింగ్ డెలివరీలు 7 లక్షల యూనిట్లకు చేరాయి. ఇటీవల ఉత్పత్తి పెరిగి, చిప్‌ల సరఫరా మెరుగుపడటంతో కంపెనీలు కొత్తగా అమ్మకాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్, తగ్గింపులు ఇస్తామని వెల్లడించాయి.