BYD eMAX 7 Electric Car: భారత మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన బీవైడీ..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 530 కిలోమీటర్లు

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-08 15:11:49.0  )
BYD eMAX 7 Electric Car: భారత మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన బీవైడీ..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 530 కిలోమీటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ(BYD) కంపెనీ తన కొత్త ఇమాక్స్ 7(eMAX 7)ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త కారు బేస్ మోడల్ ధర రూ. 26.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా టాప్ వేరియంట్ ధర రూ. 29.9 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈ కారు 6, 7 సీటర్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త బీవైడీ ఇమాక్స్ 7 కారు క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఈ కారు కు సంబధించి బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని,కొనుగోలు చేయాలనుకునే వారు సమీపంలోని డీలర్ షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించి రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ కారు ఇమ్యాక్స్ 7 సుపీరియర్, ప్రీమియం వంటి రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రీమియం వేరియంట్ లో 71.8 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక సుపీరియర్ వేరియంట్ లో 55.4 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్ ఉండగా దీని పూర్తి ఛార్జ్ చేస్తే 420 కిలోమీటర్ల దూరం వెళ్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు సుపీరియర్ వెర్షన్ కేవలం 8.6 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఇక ప్రీమియం వేరియంట్లు 10.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవని కంపెనీ తెలిపింది. ఇక ఫీచర్ల గురించి చూస్తే..సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్‌, 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇవేకాక 12.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆప్షన్స్‌ ఉన్నాయి. డ్యాష్ బోర్డ్ ప్యానెల్స్‌తో సహా సేఫ్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed