Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు

by Harish |
Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం రూ. 1.52 లక్షల కోట్లను కేటాయించారు. అధిక దిగుబడినిచ్చే, శీతోష్ణస్థితి వాతావరణాన్ని తట్టుకోగల 109 కొత్త రకాలైన 32 ఫీల్డ్, హార్టికల్చర్ పంటల విత్తనాలను రైతుల సాగు కోసం విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తామని బడ్జెట్‌లో తెలిపారు. అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఆటోమొబైల్స్, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ టూ వీలర్లు, ట్రాక్టర్లకు కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పారు.


Union Budget : బంగారం, వెండి కొనాలనుకునే వారికి కేంద్రం తీపి కబురు


Click Here For Budget Updates!



Next Story